ఔషధ ధరలపై నిపుణుల కమిటీ

ఔషధ ధరల నియంత్రణ అమలుకు సంబంధించిన అంశాలపై సంప్రదింపుల కోసం నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీ ధరలు, కొత్త ఔషధ విడుదలకు సంబంధించిన సాంకేతికంశాలను సైతం పర్యవేక్షించనుంది. ఈ నిపుణుల కమిటీ కన్వీనర్‌గా జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) సభ్య కార్యదర్శి వ్యవహరించనున్నారని ఔషధ విభాగం (డీఓపీ) తెలిపింది. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ), ఆరోగ్య పరిశోధన/ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌, నైపర్‌లకు చెందిన ప్రతినిధులు.. ఈ  కమిటీలో సభ్యులుగా ఉంటారని డీఓపీ వెల్లడించింది. నాలుగు వారాల్లోగా ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది.