ఓటర్ల జాబితాలో సవరణలకు 31 వరకు గడువు

ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, వినతుల నమోదుకు ఈ నెల 31 వరకు గడువు ఇస్తున్నట్టు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి అనూప్ సింగ్ ప్రకటించారు. వచ్చే జనవరి 1 తో 18 ఏళ్లు నిండేవారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. హైదరాబాద్ లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని 36 అర్బన్ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సవరణ చేపట్టామని, ఇప్పటికే ముసాయిదా జాబితా ప్రకటించామని తెలిపారు. ఓటరు కార్డుల జారీలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని, మీ-సేవ అధికారులు సమస్యలను పరిష్కరిస్తారని అనూప్‌ సింగ్‌ చెప్పారు.