ఓఖీ ధాటికి 16 మంది మృతి

తమిళనాడు, కేరళలో ఓఖీ తుపాన్‌ బీభత్సం కొనసాగుతోంది. ఈ ఎఫెక్ట్ రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 16 మంది మృతి చెందారు. కేరళలో గల్లంతైన జాలర్ల కోసం ఇండియన్‌ నేవీ ముమ్మరంగా గాలింపు చేపట్టింది. మొత్తం 80 మంది జాలర్లలో 60 మంది జాలర్లు అచూకీ కనుగొన్నారు. మరో 20 జాలర్ల కోసం సముద్రమంతా జల్లెడ పడుతున్నారు. అటు తమిళనాడులోని తీర ప్రాంతలైనా 11 జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారి జిల్లాలో మాత్రం ఓఖీ ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ఈ ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటు కేరళలోని తిరువంతపురం లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాన్ కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదురైన సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్‌డిఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉంది. ఇక ప్రధాని మోడీ సైతం ఓఖీ తుపాన్ విలయం గురించి తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.