ఒకే గ్రూప్‌లో పోర్చుగల్, స్పెయిన్

వచ్చే ఏడాది జరుగనున్న ఫిఫా ప్రపంచకప్ పోటీల డ్రాను నిర్వాహకులు విడుదల చేశారు. 2010 విజేత స్పెయిన్, యూరోపియన్ చాంపియన్ పోర్చుగల్ జట్లు ఒకే గ్రూప్‌లో పోటీపడనున్నాయి. బరిలో ఉన్న 32 జట్లను 8 గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో 4 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ, మెక్సికో, స్వీడన్, దక్షిణ కొరియా గ్రూప్-ఎఫ్‌లో ఉన్నాయి. గ్రూప్-ఎలో రష్యా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఉరుగ్వే, గ్రూప్-బిలో పోర్చుగల్, స్పెయిన్, మొరాకో, ఇరాన్, గ్రూప్-సిలో ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, పెరూ, డెన్మార్క్, గ్రూప్-డిలో అర్జెంటీనా, ఐస్‌లాండ్, క్రొయేషియా, నైజీరియా, గ్రూప్-ఈలో బ్రెజిల్, స్విట్జర్లాండ్, కోస్టారికా, సెర్బియా, గ్రూప్-జిలో బెల్జియం, పనామా, ట్యూనిషియా, ఇంగ్లండ్, గ్రూప్-హెచ్‌లో పోలెండ్, సెనెగల్, కొలంబియా, జపాన్‌లు ఉన్నాయి. 2018 ఫిఫా ప్రపంచకప్ వచ్చే ఏడాది జూన్ నుంచి జులై వరకు రష్యాలో జరుగుతుంది. డ్రా విడుదల కార్యక్రమంలో దిగ్గజ ఫుట్ బాల్ క్రీడాకారులు మారడోనా, పీలే పాల్గొన్నారు.