ఏడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు!

ప్రభుదేవా, భూమిక కాంబినేషన్ లో తెరకెక్కిన తమిళ చిత్రం కళవాడియ పొళుదుగల్. తంగర్ బచ్చన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎన్నో అవాంతరాలను అధిగమించి ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నది. 2010లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. చిక్కులు తొలగడంతో ఈ నెలలో సినిమా రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు నిర్మాత కరుణాకరన్ వెల్లడించారు. ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది.