ఎయిర్ ఏషియా స్పెషల్ ఆఫర్‌!

ఎయిర్ ఏషియా మరో స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.999గా నిర్ణయించింది. ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనున్నట్లు తెలిపింది. ఈ నెల 10 లోపు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు మే 7, 2018 నుంచి జనవరి 31, 2019 లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని వెల్లడించింది. ఇతర విమానయాన సంస్థలు కూడా రూ.1,099కే టికెట్టును అందిస్తున్నట్లు ప్రకటించాయి.