ఎయిర్‌ సెల్, మ్యాక్సిస్  కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

ఎయిర్‌ సెల్, మ్యాక్సిస్  కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బంధువుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టింది. చెన్నైలోని నాలుగు ప్రాంతాలతో పాటు కోల్‌ కతాలోని రెండు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. 2006లో మారిషస్‌  కు చెందిన మ్యాక్సిస్‌,  ఎయిర్  సెల్  లో 35వందల కోట్ల రుపాయలు పెట్టుబడికి కేంద్రం అనుమతి కోరింది. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం సొంతంగా నిర్ణయం తీసుకొని అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.  దీంతో విచారణ చేపట్టిన ఈడీ చిదంబరం కుమారుడిపై కేసు నమోదు చేసింది