ఉల్లి, టమాట ధరలు తగ్గుతాయ్!

వచ్చే 15-20 రోజుల్లో ఉల్లి, టమాట ధరలు క్రమంగా తగ్గుముఖం పడతాయని భావిస్తున్నామని వ్యవసాయశాఖ కార్యదర్శి ఎస్‌.కె.పట్నాయక్‌ తెలిపారు. ధరల పెరుగుదల సమస్య కొద్దికాలమేనని, త్వరలోనే పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ రిటైల్‌ మార్కెట్‌లో ఉల్లి, టమాటలను కిలో రూ.70-80కు విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో దాదాపు ఇదే ధర ఉంది. ‘త్వరలోనే ధరలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నాం. ఉల్లి పంట ఎక్కువగా సాగుచేసే మహారాష్ట్రలో ఉత్పిత్తి బాగుంది. ఒకసారి పంట చేతికొస్తే ధరలు తగ్గిపోతాయి. వచ్చే 15-20 రోజుల్లో పరిస్థితి చక్కబడుతుంది.’ అని పట్నాయక్‌  తెలిపారు.