తెలుగు మహాసభల ఏర్పాట్ల పర్యవేక్షణకు ఉపసంఘం

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నాయకత్వంలోని కమిటీలో సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్, ఆర్ అండ్ బి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు సభ్యులుగా ఉంటారు. తెలంగాణ సాహిత్య అకాడమీతో పాటు ఇతర సంస్థలు, అధికారుల సమన్వయంతో ఈ కమిటీ తెలుగు మహాసభల ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది.

అంతకుముందు, ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన వేదికైన హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంను ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. అవసరమైన సూచనలు చేశారు. ఆ తర్వాత ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశమై చర్చించారు.