ఉత్తర్ ప్రదేశ్‌  స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఉత్తర్  ప్రదేశ్‌  స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. 652 మున్సిపల్  స్థానాలకు లెక్కింపు నిర్వహిస్తున్నారు. వీటిల్లో 16 నగర నిగమ్‌లు, 198 నగరపాలిక పరిషత్‌లు, 438 నగర పంచాయతీలు ఉన్నాయి. 16 మేయర్‌ స్థానాలకు గాను బీజేపీ పదింటిలో ముందుంజలో ఉండగా.. బీఎస్పీ 5, కాంగ్రెస్‌ ఒక స్థానంలో లీడ్‌ లో ఉంది. మీరట్‌, సహరాన్‌  పూర్‌, లక్నో, ఘజియాబాద్‌, గోరఖ్‌  పూర్‌  ప్రాంతాల్లో కమలం అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. సాయంత్రం వరకు పూర్తి ఫలితాలు వెలుబడే అవకాశం ఉంది.