ఈ-కామర్స్‌ సంస్థలతో యువతకు ఉద్యోగాలు!

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు స్నాప్‌డీల్‌, పేటీటీమ్‌, షాప్‌క్లూస్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా యువతకు భారీగా ఉద్యోగాలు దొరుకుతున్నాయని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. 2016 అక్టోబరు 31 నుంచి 2017 అక్టోబరు 31 మధ్య నిర్వహించిన సర్వేలో 57 శాతం ఉద్యోగాలను ఈ నాలుగు కంపెనీలు కల్పించనట్టు వెల్లడైంది. అత్యధిక మందికి ఉపాధిని కల్పించిన జాబితాలో స్నాప్‌డీల్‌ 53 శాతంతో ముందుంది. పేటీఎమ్‌(23), షాప్‌క్లూస్‌(11), ఫ్లిప్‌కార్ట్‌(4), జొమాటో(4) ఓలా క్యాబ్స్‌(3), ఇన్‌మొబి(2) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీరిలో 83 శాతం మంది దేశ రాజధాని దిల్లీ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌, హైక్‌ మెసెంజర్‌, ఇన్‌మొబి, ము సిగ్మా, ఓలా క్యాబ్స్‌, పేటీఎమ్‌, షాప్‌క్లూస్‌, స్నాప్‌డీల్‌, రెన్యూ పవర్‌, జొమాటో సంస్థలను పరిగణలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించారు.