ఆకట్టుకుంటున్న ‘టార్చ్‌లైట్‌’ ఫస్ట్‌లుక్‌!

జయం, అన్నియన్‌ తో పాటు మరికొన్ని హిట్‌ చిత్రాలు ఖాతాలో వేసుకున్న సదాకు..  ఆ తర్వాత అవకాశాలు కనుమరుగయ్యాయి. దీంతో కొంతకాలంగా బుల్లితెర జడ్జిగా కాలం వెల్లదీస్తుంది. తాజాగా ఆమె ‘టార్చిలైట్‌’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. రొటీన్‌ జీవితంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల నేపథ్యంలో సాగే కథ ఇది. మరీ ముఖ్యంగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించే మహిళలు ఎలాంటి తిప్పలు పడుతున్నారో చెప్పే సినిమా. తెల్ల చీర మీద ఎరుపు రంగు డీప్‌ నెక్‌ బ్లౌజ్‌తో వెనక్కి తిరిగిన సదా ‘టార్చ్‌లైట్‌’ ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అబ్దుల్‌ మజీద్‌ దర్శకత్వం వహిస్తున్నారు.