అమెరికాలో తగ్గిన విదేశీ పర్యాటకుల సంఖ్య

వీసా నిబంధనలు కఠినతరం చేయడం, ట్రావెల్‌ బ్యాన్‌ కారణంగా అమెరికాలో విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వ్యాపార పనుల మీద వచ్చే వారి సంఖ్య దీని కన్నా మరింత పడిపోయిందని అమెరికా ట్రావెల్‌ అండ్‌ టూరిజం డిపార్ట్‌ మెంట్‌ ప్రకటించింది. గతేడాది తొలి 6నెలలతో పోలిస్తే ఈసారి జూన్‌ నాటికి అమెరికాలో పర్యటించిన వారి సంఖ్య 4 శాతం తగ్గింది. మెక్సికో పర్యాటకుల సంఖ్యలో 9 శాతం, బ్రిటన్‌ టూరిస్టుల సంఖ్య 6 శాతం తగ్గింది. బిజినెస్‌ పనులపై వచ్చే వారి సంఖ్య కూడా 9 శాతం పడిపోయింది. ఇక భారత్, వెనెజులా, అర్జెంటీనా, బ్రెజిల్‌ తదితర దేశాల నుంచి వచ్చే టూరిస్టులు సైతం 10 శాతానికి పైగా తగ్గిపోగా.. యుద్ధానికి కాలు దువ్వుతున్న ఉత్తర కొరియా నుంచి అమెరికాకు వచ్చే పర్యాటకుల సంఖ్య 18 శాతం పెరిగింది.