అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి

అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవల్లి మండల కేంద్రంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఆ తర్వాత గొల్ల కురుమలకు 36 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.