అది హైదరాబాద్ మెట్రో పిల్లర్ కాదు!

హైదరాబాద్  మెట్రో పిల్లర్‌లో పగుళ్లంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. ఐఎస్‌బీ గచ్చిబౌలి మార్గంలో మెట్రో పిల్లర్‌లో పగుళ్లంటూ జరుగుతున్న ప్రచారం అసత్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ మార్గంలో మెట్రో లైనే లేదన్నారు. సోషల్ మీడియాలోని పోస్టులపై మంత్రి కేటీఆర్ కూడా వివరణ ఇచ్చారని తెలిపారు. అది పెషావర్‌లోని మెట్రో పిల్లర్.. హైదరాబాద్‌ది కాదని మెట్రో ఎండీ తేల్చిచెప్పారు. మన మెట్రో పిల్లర్లు వేల టన్నుల బరువు, భూకంపాలను తట్టుకునే విధంగా నిర్మించామని తెలిపారు. హైదరాబాద్ మెట్రోకు వస్తున్న ఆదరణను ఓర్వలేకనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.