అడిలైడ్ టెస్టులో ఆసీస్ విజయం

అడిలైడ్ టెస్టులో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. రెండో టెస్టులో 120 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది. ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఆసీస్ ముందంజలో ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 442/8 డిక్లేర్డ్ కాగా, రెండో ఇన్నింగ్స్ 138 పరుగులు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 227, రెండో ఇన్నింగ్స్ 233 పరుగులకే ఆలౌట్ అయ్యింది.