హైదరాబాద్ లో మంచినీటికి కొరత రానివ్వం

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సర్కిల్ వద్ద మెట్రో వాటర్ వర్క్స్ పైప్ లైన్స్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మాజీ కేంద్రమంత్రి, ఎంపీ దత్తాత్రేయ, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్ రెడ్డి, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్ తో పాటు పలువురు కార్పోరేటర్లు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఖాళీ బిందెలతో జలమండలి ముందు ధర్నా చేసేవారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో హైదరాబాద్ లో మంచినీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశామని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేపట్టారని తెలిపారు. భవిష్యత్ లో హైదరాబాద్ కు తాగునీటి ఎద్దడి రాకుండా నగరానికి ఇరువైపుల 20 టీఎంసీల రిజర్వాయర్లను నిర్మిస్తున్నామని మంత్రి వివరించారు.