హైదరాబాద్ లో ప్రధాని మోడీ పర్యటన 

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన వివరాలు అధికారికంగా విడుదలయ్యాయి. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని రాత్రి పదిన్నర వరకు హైదరాబాద్ లో పర్యటించనున్నరు. దాదాపు తొమ్మిది గంటలు హైదరాబాద్ లోనే ఉండి… మొదట మెట్రోరైలు ప్రారంభించి, జీఈఎస్ సదస్సులో పాల్గొని.. ఫలక్‌ నుమా ప్యాలెస్‌లో విందు చేసి గుజరాత్ లోని రాజ్ కోట్ కు వెళ్లనున్నరు. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ప్రధాని మోడీకి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్  ఘన స్వాగతం పలుకనున్నరు. స్వాగత కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోడీ హైదరాబాద్ కు  బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.10గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకొంటారు. మెట్రోరైలును ప్రారంభించేందుకు 1.45కు బేగంపేట నుంచి మియాపూర్‌కు హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. 2.05కు హెలికాప్టర్‌లో మియాపూర్ మెట్రోడిపోకు చేరుకొని..2.15 నిముషాల వరకు మెట్రో ప్రారంభవేదికకు చేరుతారు. 2.15-2.18 నిముషాలకు మెట్రో పైలాన్‌ను ఆవిష్కరించి, హైదరాబాద్  మెట్రో ను జాతికి అంకితం చేయనున్నారు. 2.20-2.28: మెట్రోయాప్, బ్రోచర్, ప్రాజెక్టు ఆడియో విజువల్‌ ను వీక్షించనున్నరు. అనంతరం రెండున్నర నుంచి మెట్రో రైల్ లో మియాపూర్ నుంచి కూకట్‌ పల్లి వరకు ప్రయాణించి తిరిగి మియాపూర్ వస్తారు. అక్కడనుంచి 2.50 నిముషాలకు మియాపూర్ నుంచి హెలికాప్టర్‌ లో హెచ్‌ఐసీసీకి బయలుదేరుతారు.
మియాపూర్ నుంచి బయలు దేరిన ప్రధాని మోడీ 3.15 గంటలకు హెచ్‌ఐసీసీకి హెలికాప్టర్ ద్వారా చేరుకొంటారు. 3.25 నిముషాల వరకు జీఈఎస్ సదస్సు జరిగే వేదిక వద్దకు చేరుకొని 3.35-3.55 ఇవాంకట్రంప్‌తో భేటీ కానున్నరు. 4 గంటలకు ఎగ్జిబిషన్ వద్దకు చేరుకొని 4.30 నుంచి 4.40 నిముషాల వరకు  జీఈఎస్ సమావేశమందిరంలో మహిళలకు ప్రథమ ప్రాధాన్యం-అందరికీ సౌభాగ్యం అనే అంశంపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను తిలకించనున్నరు. 4.40 నుంచి 4.43 నిముషాల వరకు సీఎం కేసీఆర్ జీఈఎస్ సదస్సులో స్వాగతోపన్యాసం చేయనున్నరు. అనంతరం 4.43 కు జీఈఎస్ ప్రారంభమైనట్టుగా ప్రధాని మోదీ అధికారికంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బటన్ నొక్కి ప్రారంభించనున్నరు. 4.45 నంచి 4.50 ఇవాంకట్రంప్ జీఈఎస్ సదస్సులో ప్రసంగించనున్నరు. 4.50 నుంచి 5.10 వరకు  ప్రధాని మోదీ ప్రసంగించనున్నరు. జీఈఎస్ సదస్సులో చివరగా 5.10 నుంచి 5.13 నిముషాల వరకు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వందన సమర్పణ చేయనున్నరు.  అనంతరం 5.30 నుంచి 5.56 నిముషాలకు హెచ్‌ఐసీసీలోని వీఐపీ లాంజ్‌కు చేరుకొని జీఈఎస్ మహిళా వక్తలతో..  ప్రధాని మోడీ మాట్లాడుతారు. 5.56 నుంచి 6.03 నిముషాల వరకు గ్రూపు మీటింగ్‌లో పాల్గొంటారు. 6.03 గంటల నుంచి ఐదు నిముషాలకు ఒకరి చొప్పున పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. 6.32 నిముషాల నుంచి ఏడింటి వరకు  రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం 15 నిముషాలపాటు పలువురిని మర్యాదపూర్వకంగా కలుస్తారు. హెచ్ ఐసీసీలో ప్రధాని కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఏడున్నరకు రోడ్డు మార్గం గుండా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు బయలుదేరుతారు.

హెచ్ ఐసీసీ నుంచి రోడ్డు మార్గం గుండా ఫలక్‌నుమా ఫ్యాలెస్ ను ప్రధాని  చేరుకొంటారు. 8 గంటల 05 నిముషాల నుంచి 8.20 నిముషాల వరకు ట్రీ ఆఫ్ లైఫ్ షోకేజ్ ఆన్ ఫ్యాబ్రిక్స్ అండ్ క్రాఫ్ట్స్ ను ప్రధాని తిలకిస్తారు. 8.20 నుంచి 8.35 వరకు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించనున్నరు. 8.45 నుంచి 9.50 వరకు విందులో పాల్గొంటారు. 10.05 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరుతారు. రాత్రి 10.25 గంటలకు హైదరాబాద్  పర్యటనను ముగించుకొని ప్రధాని మోడీ గుజరాత్‌ లోని రాజ్‌కోట్‌ కు ప్రయాణమవుతారు.