హైదరాబాద్ లో ఆసియా హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. ఇవాళ్టి నుంచి యూసుఫ్ గూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆసియా పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నీ ప్రారంభం కానుంది. 11 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. భారత్‌తో పాటు ఖతార్, సౌదీ ఆరేబియా, యూఏఈ, ఉజ్బెకిస్థాన్, ఇరాన్, ఇరాక్, బహ్రెయిన్ అదృష్ట్యాన్ని పరిక్షించుకోనున్నాయి. దాదాపు 200 మంది ప్లేయర్లు పాల్గొంటున్న ఈ టోర్నీని కేంద్రమంత్రి వీరేంద్రకుమార్ చౌదరీ ప్రారంభించనున్నారు