హైదరాబాద్ మెట్రోరైలు ప్రారంభం

హైదరాబాద్ మెట్రోరైలుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. మియాపూర్ డిపో దగ్గర ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరించి మెట్రోరైలుని సీఎం కేసీఆర్ తో కలిసి జాతికి అంకితం చేశారు. మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మెట్రోరైలు యాప్, బ్రోచర్‌ లను మోడీ ఆవిష్కరించారు. ఆ తర్వాత మెట్రో ప్రాజెక్టుపై ఆడియో విజువల్‌ను ప్రజంటేషన్ ను ప్రధాని వీక్షించారు.

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు గవర్నర్ నరసింహన్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్,  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.