హెచ్ఐసీసీలో హెలికాప్టర్ ట్రయల్ రన్

హెచ్‌ఐసీసీలో ప్రారంభం కానున్న ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ప్రధాని మోడీ హాజరుకానుండడంతో రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌ చేరుకుని.. మియాపూర్‌లో మెట్రో ప్రారంభం అనంతరం సదస్సు ప్రాంగణానికి చేరుకోనున్నారు. దీంతో ఆ రూట్‌లో ట్రయల్‌ నిర్వహిస్తోంది రక్షణ శాఖ.