హెచ్ఐసీసీలో మిస్ వరల్డ్ మానుషి

హైదరాబాద్ లో మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ తళుక్కున మెరిసింది. హెచ్ఐసీసీలో జరుగుతున్నప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ఆమె పాల్గొన్నది. ఈ కార్యాక్రమంలో మానూషి మాట్లాడుతూ మిస్ వరల్డ్ కిరీటం దక్కడం పట్ల దేశం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. స్త్రీ, పురుషులిద్దరినీ సమానంగా చూడాల్సిన అవసరముందని..ఈ విషయాన్ని పురుషులు తెలుసుకోవాలని మానుషి సూచించారు.