హల్దిబరిలోని ఓ స్కూల్‌ లో తొక్కిసలాట

బెంగాల్  హల్దిబరిలోని ఓ స్కూల్‌ లో తొక్కిసలాట జరిగింది. స్కూల్ కు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ ఆవరణలో బాంబ్ పేలడంతో…భయాందోళనలకు గురైన విద్యార్ధులు ఒక్కసారిగా బయటకు పరిగెత్తుకొని వెళ్లారు. ఈ క్రమంలో పలువురు విద్యార్ధులు కింద పడి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 64 మంది విద్యార్ధులు గాయపడ్డారు. పలువురు సృహతప్పి పడిపోయారు. అయితే వారిలో 22 మంది విద్యార్ధులను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. క్రూడ్ బాంబ్ పేలుడు శబ్ధం రావడంతో…స్కూల్లో బాంబ్ పెట్టారని పుకార్లు వచ్చాయని, అందుకే తొక్కిసలాట జరిగిందని టీచర్లు తెలిపారు.