హర్యానా సీఎంతో ఢిల్లీ సీఎం భేటి

ఢిల్లీలో కాలుష్య  నియంత్రణ కోసం పొరుగు రాష్ట్రాలతో చర్చలు ప్రారంభించారు ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇవాళ చంఢీగఢ్ వెళ్లిన ఆయన… హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశమయ్యారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగేందుకు ప్రధాన కారణమైన వ్యవసాయ వ్యర్థాల దహనంపై ఖట్టర్ తో కేజ్రీవాల్ చర్చించారు. ఎండుగడ్డిని రైతులు కాల్చకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఎండుగడ్డి రవాణా కోసం ఇవ్వాల్సిన చార్జీలను చెల్లించాలని, దాంతో ఎండుగడ్డి దహనం తగ్గుతుందని సూచించారు.