హఫీజ్ విడుదలపై భారత్ ఆగ్రహం

ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌  విడుదలపై భారత్‌  ఆగ్రహం వ్యక్తి చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది అయిన అతనిపై పాకిస్థాన్‌  గృహ నిర్భందం ఎత్తివేయడం దారుణమని మండిపడింది. ఉగ్రవాదం విషయంలో దయాది దేశం తీరు ఇంకా మారలేదని ఫైరయ్యింది. మరోసారి పాక్‌ నిజస్వరూపం బయట పడిందన్నారు విదేశాంగ ప్రతినిధి రవీశ్‌  కుమార్. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన అతన్నివిడుదల చేసి పాకిస్థాన్  మరో తప్పు చేసిందన్నారు. జమాత్‌ ఉద్‌ దవా అధినేత, లష్కరే తొయిబా వ్యవస్థాపకుడైన హఫీజ్‌ సయీద్‌  ను అమెరికా ఒత్తిడి మేరకు పాక్‌ ప్రభుత్వం జనవరిలో గృహ నిర్బంధంలో ఉంచింది. దానిని పొడిగించాలని కోరుతూ పిటిషన్ వేయగా.. లాహోర్ కోర్టు కొట్టేసింది.