స్టార్ హీరో సరసన చాన్స్ కొట్టేసిన రకుల్

హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరో స‌ర‌స‌న చాన్స్ కొట్టేసింది.. తాజాగా ఆమె కార్తీ స‌ర‌స‌న త‌మిళ మూవీ తీరన్ అదిగారం ఒండ్రు’ లో న‌టించింది.. తెలుగులో ‘ఖాకి’ పేరుతో ఈ మూవీ ఈ నెల 10 వ తేదిన‌ విడుద‌ల కానుంది.. ఈ మూవీ త‌ర్వాత కార్తీ అన్న‌య్య సూర్య‌తో న‌టించ‌నుంది. ఈ చిత్రాన్ని సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేయనున్నాడు. డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్సార్ ప్రభు, ఎస్సార్ ప్రకాష్ బాబులు నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభ‌కానుంది.. సూర్య స‌ర‌స‌న ఛాన్స్ రావ‌డంతో ర‌కుల్ ఆనందం వ్య‌క్తం చేసింది..