స్కూలులో దుండగుడి కాల్పులు, ఐదుగురు మృతి

అమెరికాలో మరోసారి తూటా పేలింది. ఉత్తర కాలిఫోర్నియాలోని థెహామా కౌంటీలో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ట్రక్ పై వచ్చిన దుండుగుడు రాంచో థెహామా ఎలిమెంటరీ స్కూల్ గేట్ ను ఢీకొట్టి, చిన్నారులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు.

బుల్లెట్ల శబ్ధంతో స్కూల్ ఆవరణ మారుమోగింది. భయంతో విద్యార్ధులు, టీచర్లు తరగతి గదుల్లో దాక్కున్నారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు… అక్కడికి చేరుకోవడంతో వారిపై కూడా కాల్పులు జరిపాడు దుండగుడు. కాసేపు పోలీసులకు, దుండగుడికి మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. పోలీసులు దుండగుడ్ని హతమార్చారు. అయితే, దుండగుడు ఎందుకు కాల్పులకు పాల్పడ్డాడో  కారణాలు ఇంకా తెలియరాలేదు.