సైక్లింగ్ పార్క్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

దేశంలో ఎక్కడా లేని విధంగా నగరంలో సైక్లింగ్ పార్క్‌ను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్తగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఏర్పాటు చేసిన పాలపిట్ట సైక్లింగ్ పార్క్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ కాంక్రీటు జంగల్‌గా మారిపోతున్న సందర్భంలో హరిత వనాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బొటానికల్ గార్డెన్ భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుంటే టీఆర్‌ఎస్ ఆడ్డుకున్నదని గుర్తు చేశారు.  సైక్లింగ్ పార్క్‌లో చిన్న పిల్లల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.