సెర్ప్ ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలం

సెర్ప్ లో పని చేస్తున్న ఉద్యోగులు, కంప్యూటర్ ఆపరేటర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని పంచాయతి రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. వీరి డిమాండ్లు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని, వీటిని సీఎం కేసీఆర్ దృష్టికి కూడా  తీసుకువెళ్ళామని తెలిపారు. ఇప్పటికే ఉద్యోగుల డిమాండ్లను అధికారులతో చర్చించానని, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేస్తోందన్నారు.