సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్ష ఎన్నికలపై ఈ సమావేశంలోచర్చించనున్నారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా చేసేందుకు ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియను డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. దీంతో ఈ ప్రక్రియను వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు పార్టీ నేతలు. డిసెంబర్ 1వ తేదీన పార్టీ అధ్యక్ష ఎన్నికల నామినేషన్లకు తుది గడువుగా ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే గుజరాత్ ఎన్నికల కంటే ముందుగానే పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ ను ప్రకటించే అవకాశముంది.