సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

రైతు సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు పంటలకు ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడి ఇస్తుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల నుంచి ముస్తాబాద్ వరకు రూ. 28 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న రెండు వరసల రహదారికి, జిల్లెళ్లలో రూ. 50 లక్షల ఖర్చుతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి, అంకిరెడ్డిపల్లిలో కోటిన్నర ఖర్చుతో కొత్తగా నిర్మించే 32/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపనలు చేశారు. గ్రామస్తులతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ కు గ్రామగ్రామాన ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికారు.