సికింద్రాబాద్ లో పోలీసుల కార్డెన్ సెర్చ్

సికింద్రాబాద్‌  గోపాలపురం పీఎస్  పరిధిలో పోలీసులు కార్డన్‌  సెర్చ్‌ నిర్వహించారు. 78 లాడ్జీల్లో తనిఖీలు చేపట్టారు. పది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పలు వాహనాలను సీజ్‌  చేశారు. చాలా లాడ్జీల్లో సీసీ కెమెరాలు లేవని… ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని పోలీసులు గుర్తించారు. వెంటనే వాటిని అందుబాటులోకి తేవాలని సూచించారు. డీసీపీ సుమతి ఆధ్వర్యంలో దాదాపు 500 మంది పోలీసులు ఈ కార్డన్‌ సెర్చ్‌ లో పాల్గొన్నారు.