సింగపూర్ లో హైదరాబాద్ వ్యాపారి దారుణ హత్య

హైదరాబాద్ కుషాయిగూడలోని మహేష్ నగర్ కు చెందిన నగల వ్యాపారి వాసుదేవ్ రాజ్ ను సింగపూర్ లో దుండగులు దారుణంగా హత్య చేశారు. వ్యాపారం పేరుతో వాసుదేవ్ ను సింగపూర్ తీసుకెళ్లిన నిందితులు.. అక్కడ అతన్ని గదిలో బంధించారు. అతని బంధువులకు ఫోన్ చేసి రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. వాసుదేవ్ ను బంధించిన ఫోటోలను నిందితులు వాట్సాప్ లో అతని బంధువులకు పంపించారు. బంధువులు సకాలంలో స్పందించలేదనే కారణంతో వాసుదేవ్ ను హత్య చేశారు. వాసుదేవ్ హత్యకు సంబంధించిన సమాచారం సింగపూర్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులు అతని కుటుంబ సభ్యులకు అందించారు. రేపు లేదా ఎల్లుండి వాసుదేవ్ మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకురానున్నారు.