సాంకేతికను ఉపయోగించుకొని మహిళలు రాణించాలి

పారిశ్రామిక రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు డెల్ ఈఎంసీ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ కరెన్ క్వింటోస్. సాంకేతికను ఉపయోగించుకొని పారిశ్రామిక రంగంలో మహిళలు రాణించాలన్నారు. హెచ్‌ఐసీసీలో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ లో భాగంగా  నిర్వహించిన ప్లీనరీలో ఆమె పాల్గొన్నారు. మహిళలు తమలోని శక్తిపై నమ్మకం ఉంచినప్పుడే రాణించగలుగుతారన్నారు. సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్, ఇంజనీరింగ్ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సి ఉందన్నారు కరేన్.