సవరించిన గ్రూప్-1 ఫలితాలు విడుదల

2011 గ్రూప్-1 ఫలితాల సవరించిన జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. 2011 నోటిఫికేషన్ గ్రూప్-1 ఫలితాలు గత నెల 28న టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ప్రాధాన్యతల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఫలితాలను నిలిపివేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ప్రాధాన్యతలు తారుమారయ్యాయని అభ్యర్థులు ఫిర్యాదు చేయడంతో టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తిస్థాయి పరిశీలన తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని తెలిపిన టీఎస్‌పీఎస్సీ నేడు సవరించిన గ్రూప్-1 ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. కాగా తాజా గ్రూప్-1 ఫలితాల వెల్లడిలో భారీగా మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. మారిన ఫలితాల్లో 48 మంది అభ్యర్థులకు గతంలో కంటే మెరుగైన పోస్టులు దక్కాయి. గత జాబితాలో చోటు దక్కిన 10 మందికి కొత్త జాబితాలో నిరాశ ఎదురవగా.. కొత్తగా 10 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి.