షాపూర్-నాసిక్ రహదారిపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా

మహారాష్ట్రలోని షాపూర్-నాసిక్ రహదారిపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది.  తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. బోల్తా పడ్డ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకవ్వడంతో…హైవేపై రాకపోకలు నిలిపివేశారు. గ్యాస్ లీకేజీని సరిచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అయితే ట్యాంకర్ డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పినట్లయింది. పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక, పక్కనే ఉన్న డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై దాదాపు మూడు గంటల పాటూ ట్రాఫిక్ జామ్ అయింది.