వారంలో పెళ్లి ఉండగా..

హైదరాబాద్ కొత్తపేటలో విషాద ఘటన జరిగింది. టిప్పర్ ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. వారం రోజుల్లో పెళ్లి కావాల్సిన గీత షాపింగ్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. బైక్ ను టిప్పర్ ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. పెళ్లికూతురు కాబోతున్న గీత.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.