శ్రీలంక టూర్ కు భారత జట్టు ఎంపిక

అనూహ్య నిర్ణయాలకు తావివ్వకుండా..  సొంతగడ్డపై శ్రీలంకతో  టెస్ట్‌  సిరీస్‌కు టీమిండియాను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ  ప్రకటించింది.  మరీ ఎక్కువ మార్పులు లేకుండా  గత సిరీస్‌లో ఆడిన జట్టును మళ్లీ ఎంపిక  చేశారు.  ఒక్క  ఆల్‌ రౌండర్‌ హార్ధిక పాండ్యాకు విశ్రాంతిని కల్పించిన  సెలక్షన్‌ కమిటీ మిగతా  జట్టును తొలి  రెండు టెస్టులకు ప్రకటించింది.  సినీయర్‌ స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, సీనియర్‌ బ్యాట్స్‌మెన్లు పుజారా, రహానేలు తమ తమ స్థానాలను టెస్ట్‌ టీమ్‌లో నిలబెట్టుకున్నారు. మొత్తానికి  కోహ్లీ నేతృత్వంలోని టీమ్‌లో  మొత్తం 15 మందికి చోటు దక్కింది.  టీమ్‌లో  కెప్టెన్‌ కోహ్లీ,  వైస్‌ కెప్టెన్‌ రహానే, కేఎల్‌ రాహుల్, విజయ్‌,  ధవన్‌, రోహిత్‌, పుజారా,  రహానే,  సాహా, అశ్విన్‌, జడేజా, కుల్దీప్‌, షమీ, ఉమేశ్‌, భువనేశ్వర్‌, ఇషాంత్‌ శర్మలకు స్థానం దక్కింది.