శీతాకాల సమావేశాల్లో ట్రిపుల్ తలాఖ్ బిల్లు?

దేశంలో ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు కేంద్రం మరో అడుగు ముందుకు వేయబోతోంది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ట్రిపుల్ తలాక్ కు ముగింపు పలకాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆచారాన్ని దుర్వినియోగపరుస్తున్న భర్తల నుంచి భార్యలకు రక్షణ కల్పించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బిల్లు రూపకల్పనకు మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసినట్లు కూడా సమాచారం. వివాదాస్పద ట్రిపుల్ తలాక్ విధానాన్ని రెండు నెలల క్రితమే సుప్రీంకోర్టు రద్దు చేసింది. పార్లమెంట్‌ లో బిల్లుకు ఆమోదం లభిస్తే… ఇక పూర్తిస్థాయిలో ట్రిపుల్ తలాక్‌ పద్దతి లేకుండా పోనుంది.