శరవేగంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం

పేదల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన.. డబుల్ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 16,895 కోట్ల రూపాయలతో.. 2.71 లక్షల డబుల్ బెడ్‌ రూమ్ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాటిలో దాదాపు 2.25 లక్షల ఇండ్లకు పాలనా పరమైన అనుమతులు లభించాయి. దీన్ని పూర్తి చేయాడానికి గృహ నిర్మాణ శాఖ అన్ని విభాగాల సమన్వయం కృషి చేస్తోంది.

పాలనాపరమైన అనుమతులు పొందిన వాటిలో.. 4,069 ఇండ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేశారు. ఇక మిగిలిన వాటికి స్థల పరిశీలన జరగుతుందని.. అది పూర్తయితే వాటిల్లోనూ డబుల్ బెడ్‌ రూడ్ ఇండ్ల నిర్మాణానికి అనుమతించనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,12,782 డబుల్ బెడ్‌ రూమ్ ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిని అంత్యంత వేగంగా పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇండ్ల నిర్మాణాలను వేగంగా, సులభంగా పూర్తి చేసేందుకు… ఇసుకను ఉచితంగా అందజేస్తున్నారు. నిర్మాణానికి ముందుకొచ్చే కాంట్రాక్లర్లు నష్టపోకుండా సిమెంట్, ఐరన్ ధరలు తగ్గించేందుకు ఆయా కంపెనీలతో ఇదివరకే ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇక… జీహెచ్ంఎసీ పరిధిలో ఇండ్ల నిర్మాణ పనులు కూడా అంత్యంత వేగంగా జరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం లక్ష ఇండ్ల నిర్మాణం చేపపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల మాదిరిగా ఎక్కువ స్థలం దొరకదు కాబట్టి.. మూడు నుంచి తొమ్మిది అంతస్తుల భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తగ్గట్లే ప్లాన్లు రూపొందించి అమలుపరుస్తోంది.  ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కట్టడాల నిర్మాణాలకు ఉపయోగించే మైవాన్ టెక్నాలజీని డబుల్ బెడ్ రూమ్ నిర్మాణానికి అనుమతించాలని  ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల నిర్మాణానికి పట్టే వ్యయం గణనీయంగా తగ్గనుంది.