శతక్కొట్టిన విరాట్

రన్‌ మెషీన్‌.. టీమిండియా స్కిప్పర్‌.. విరాట్‌ కోహ్లీ.. మరో  సెంచరీతో చెలరేగాడు. శ్రీలంకతో  నాగ్‌పూర్‌ లో జరుగుతున్న రెండో టెస్ట్‌ లో అద్భుతమైన సెంచరీతో కదం తొక్కాడు. పస లేని లంక బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ.. టెస్ట్‌ కెరీర్‌లో 19వ శతకాన్ని  నమోదు చేశాడు.  దీంతో అన్ని  ఫార్మాట్‌ లలో కలిపి విరాట్‌ కోహ్లీ చేసిన సెంచరీల సంఖ్య 51కి చేరింది. అటు మూడో రోజు టీమిండియా ఓపెనర్లు విజయ్‌, పూజారా లు సెంచరీలతో చేలరేగడంతో.. రెండో టెస్ట్‌ పై భారత్ పట్టు బిగించింది. లంచ్‌ సమయానికి భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి.. 404 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీతో పాటు రహానే క్రీజ్‌ లో ఉన్నారు.