వైద్య విభాగంలో 13,496 పోస్టులు భర్తీ చేస్తున్నాం

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు పెరిగిన నమ్మకానికి పెరిగిన రోగుల సంఖ్యే నిదర్శనమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. వైద్య విభాగంలో 13,496 పోస్టులు భర్తీ చేయబోతున్నామని వెల్లడించారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలన్నీ త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్స్ ఉద్యోగాల ఖాళీల భర్తీపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ల‌క్ష్మారెడ్డి సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్స్ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తున్నామన్నారు. నర్సుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు దక్షత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు.