వెయ్యి కోట్ల పన్ను ఎగ్గొట్టిన శశికళ కుటుంబీకులు

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వి.కె శశికళ, ఆమె కుటుంబీకులు, బంధువులు వెయ్యికోట్ల రూపాయలకు పైగా పన్ను ఎగవేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. గత రెండు రోజుల పాటు జయ టీవీ సహా శశికళ బంధువుల ఇళ్లపై దాడులు చేస్తున్న ఐటీ అధికారులకు దిమ్మ తిరిగింది. బోగస్ కంపెనీల పేరిట పెద్ద మొత్తంలో మోసాలకు  పాల్పడుతున్నట్లు సోదాల ద్వారా తెలుసుకున్నారు. సొంత వ్యాపారాలు, పార్టీ సంస్థలు, కార్యాలయాల ద్వారా భారీ మొత్తంలో అక్రమ సంపదన పొగు చేసినట్లు గుర్తించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఈ బోగస్‌ సంస్థల ద్వారా పెద్దఎత్తున నగదు మార్పిడి జరిపినట్టు కనుగొన్నారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఆదాయపన్ను ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.