మూడేళ్లు పెద్ద యువతితో బ్రిటన్ యువరాజు పెళ్లి!

బ్రిటన్‌ యువరాజు హ్యారీ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. హాలీవుడ్‌ హీరోయిన్‌ మేఘన్‌  మార్కెల్‌ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇదే విషయాన్ని హ్యారీ తండ్రి ఛార్లెస్‌ అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు చెప్పారు. హ్యారీ కంటే మేఘన్‌ మూడేళ్లు పెద్ద. అంతేకాదు ఆమెకు ఇంతకు ముందే వివాహమైంది. ఇంగెల్సన్‌ తో మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే గతేడాది ఓ సినిమా షూటింగ్‌ సందర్భంగా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది. 2018లో బ్రిటన్‌ రాచమర్యాదల ప్రకారం వీరి పెళ్లి జరగనుంది.