లూథియాన ప్రమాదంలో 10 మంది మృతి

పంజాబ్ లోని లూథియానాలో నిన్న ఓ ప్లాస్టిక్ తయారీ కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.  ప్రమాద స్థలాన్ని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, డిప్యూటీ సీఎం సిద్ధు సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని, వారి కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ప్రమాద ఘటనపై విచారణకు కమిషన్ ను నియమించినట్టు తెలిపారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలన్నీ బయటికి తీసినట్టు చెప్పారు.

యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే బిల్డింగ్ లో మంటలు చెలరేగాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో కంపెనీ యజమానిపై కేసు నమోదు చేశారు. సరైన రక్షణ చర్యలు తీసుకోని ప్లాస్టిక్ కంపెనీ యజమాని ఇంద్రజిత్ సింగ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిన్న లూథియానాలోని ఓ ప్లాస్టిక్ తయారీ కంపెనీలో మంటలు చెలరేగి, భవనం కూలిపోయింది.