లూథియానా ప్రమాదంలో ముగ్గురు మృతి

పంజాబ్ లోని లూథియానాలో ఉన్న ప్లాస్టిక్ పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. ప్రమాద స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం ముమ్మరంగా శిథిలాలు తొలిగిస్తున్నారు.

సూఫియా చౌక్ ప్రాంతంలోని ప్లాస్టిక్ తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది.  వెనువెంటనే బిల్డింగ్ కూలిపోవడంతో అందులో పని చేస్తున్న కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.