లష్కరే తోయిబా దాడులను సమర్ధిస్తున్న

ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా నేత హఫీజ్ సయీద్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు పాకిస్థాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్. హఫీజ్ అంటే తనకు ఇష్టమని ఓ టీవీ షోలో చెప్పారు ముషారఫ్. అంతే కాదు చాలా సార్లు హఫీజ్ ను కలిశానని, కాశ్మీర్ లో భారత బలగాలపై లష్కరే తోయిబా దాడులను తాను సమర్ధిస్తున్నట్లు తెలిపారు.  కాశ్మీర్ లో లష్కరే తోయిబా చేసే పనులకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని, ఆ సంస్థను తాను అతిపెద్ద మద్దతుదారున్నని చెప్పారు. ఇక ముంబై దాడుల వెనుక లష్కరే తోయిబా హస్తం లేదని ఆ ఉగ్రవాద సంస్థకు మద్దతు పలికారు ముషారఫ్.