రెండో రోజు పట్టుబిగించిన టీమిండియా

నాగ్ పూర్ టెస్ట్ పై టీమిండియా పట్టుబిగించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ఓపెనర్ మురళీ విజయ్, పుజార సెంచరీలు, కెప్టెన్ కోహ్లీ హాఫ్ సెంచరీ తోడవ్వడంతో రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 107 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. వికెట్ కోల్పొయి 11 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్‌కు విజయ్‌, పుజారాలు బలమైన పునాది వేశారు. లంక బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శస్తూ సెంచరీలతో కదం తొక్కారు. అటు విజయ్ అవుటైనా తర్వాత క్రిజ్ లోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ..దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ.. స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. పుజారా 121, కోహ్లీ 54 పరుగులతో క్రీజులో ఉన్నారు.