రూ. లక్ష లోపు రైతు రుణాలన్నీ మాఫీ చేసినం

రూ. లక్ష లోపు రైతు రుణాలను వడ్డీతో సహా మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రుణ సహాయ పథకం క్రింద వడ్డీ మాఫీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రూ. లక్షకు పైగా ఉన్న అప్పుని రైతులే కట్టుకోవాలని మంత్రి తేల్చిచెప్పారు.  రూ. లక్ష వరకు అప్పు ఉన్న 35 లక్షల 30 వేల మంది రైతులకు రూ. 16 వేల 134 కోట్ల రుణాలు వడ్డీతో సహా మాఫీ చేశామని తేల్చిచెప్పారు. ఒక్క రూపాయి కూడా బాకీ లేమని మంత్రి ఉద్ఘాటించారు. లక్ష వరకు అప్పు ఉన్న వారందరికీ అప్పు తీర్చేసినట్లు మంత్రి తెలిపారు. రుణమాఫీలో సర్కార్ విఫలమైందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.