రాహుల్ కు త్వరలో పార్టీ పగ్గాలు..?

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ అతి త్వరలో  పగ్గాలు చేపట్టనున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందే రాహుల్ పదోన్నతి పొందనున్నారు. దీనిలో భాగంగా రేపు సీడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూల్‌ను ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ కొత్త అధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి మద్దతిస్తూ ఇప్పటికే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు తీర్మానాలు ఆమోదించాయి.